పిల్లలకు ఉరివేసి.. తానూ ఉసురు తీసుకున్న తల్లి

  • యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో విషాదం
  • ఇద్దరు చిన్నారులు సహా తల్లి మృతి
  • ముడి ఊడిపోవడంతో బయటపడిన చిన్న కుమార్తె
భర్త మద్యానికి బానిసయ్యాడు. కరోనాతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. అసలే ముగ్గురు ఆడపిల్లలు.. ఇలా అయితే ఎలాగని ఆ ఇల్లాలు కుంగిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ముగ్గురు పిల్లలకు చీరతో ఉరివేసింది.. తానూ ఉరేసుకుంది. ఇద్దరు పిల్లలు, ఆమె మరణించారు. అయితే, చీర ముడి ఊడిపోవడంతో చిన్న పాప ప్రాణాలతో బయటపడింది.

ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో జరిగింది. రాంనగర్ కు చెందిన వెంకటేశ్, రాణి (31) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలున్నారు. అయితే, ఇటీవలి కాలంలో భర్త మద్యానికి బానిసవ్వడంతో రాణి మానసిక ఆందోళనకు గురైంది. బుధవారం రాత్రి ముగ్గురు పిల్లలకు ఉరేసింది. రాణితో పాటు హర్షిణి (13), లక్కీ (11)లు చనిపోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
Crime News
Yadadri Bhuvanagiri District

More Telugu News